టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ నాగ శౌర్య కు హీరోగా మంచి గుర్తింపు దక్కలేదు. కాకపోతే వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఛలో మూవీ తో నాగ శౌర్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని , అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఛలో మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న నాగ శౌర్య ఆ తర్వాత అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు  అందులో కొన్ని మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర విజయాలను సాధించగా , మరి కొన్ని సినిమాలు అపజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం నాగ శౌర్య 'వరుడు కావలెను' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే ఈ సంవత్సరం నాగ శౌర్య స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన లక్ష్య అనే సినిమాలో హీరోగా నటించాడు.

సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ శౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీ లో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా , ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ తో అయిన నాగ శౌర్య మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధిస్తాడు ...  లేదో ...  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: