ఇదిలా ఉంచితే ఇక పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు అందరికీ కూడా డేట్లు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. కాగా ఆయన రాజకీయ నేతగా వరుసగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది.అంతేకాకుండా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇక అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన నిమగ్నమైతున్నాడు.అయితే ఇలాంటి సమయంలో నటించేందుకు ఆయనకు సమయం కుదరడం లేదు అనేది ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం.. ఇక అందుకే ప్రాముఖ్యత ఉన్న సినిమాలను, తక్కువ సమయంలో పూర్తి అయ్యే సినిమాలను,
ఇప్పటికే సగం వరకు పూర్తి అయిన సినిమాలను మాత్రమే ఆయన చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కాబట్టి నిజం అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ఆయన వదిలేసినట్లే అంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి.అయితే సినిమా షూటింగ్ అయితే ప్రారంభం కాలేదు.. కానీ స్క్రిప్ట్ వర్క్ కోసం దర్శకుడు హరిష్ శంకర్ భారీగానే ఖర్చు పెట్టాడట.ఇకపోతే ఆయన మైత్రి మూవీస్ వారితో దాదాపుగా ఐదు కోట్లకు పైగా ఖర్చు చేయించడానికి సమాచారం అందుతుంది.అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగిస్తాడేమో కానీ వారు ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగిచ్చే పరిస్థితి లేదు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ ఊగిసలాట కారణంగా మైత్రి వారికి ఐదు కోట్లకు మించి నష్టం జరిగిందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..!!