కొన్ని మూవీ లు ఈ వారం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉన్నాయి. ఆ మూవీ లు ఏ  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి ...  ఏ రోజు నుండి స్ట్రీమింగ్  కాబోతున్నాయి అనే విషయాన్ని ప్రస్తుతం తెలుసుకుందాం.

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో  తెరకెక్కిన విజయ్ సేతుపతి విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఒక కీలకమైన రోల్ లో సూర్య గెస్ట్ పాత్రలో తెరకెక్కిన విక్రమ్ మూవీ ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 13 వ తేదీ నుండి తమిళ్ , తెలుగు , మలయాళం , కన్నడ మరియు హిందీ భాషలలో స్ట్రీమింగ్  కావడానికి రెడీ గా ఉంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్నటువంటి మాస్ మహారాజా రవితేజ హీరోగా దివ్యాన్షా కౌశిక్ , రాజేష విజయన్ హీరోయిన్ లుగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ సోనీ లీవ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో సెప్టెంబర్ 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

 కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రాంత్ రోనా మూవీ తెలుగు భాషలో సెప్టెంబర్ 16 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

జోగి మూవీ సెప్టెంబర్ 16వ తేదీ నుండి హిందీ భాషలో నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది.

అటెన్షన్ ప్లీజ్ 3  అనే మూవీ మలయాళ భాషలో సెప్టెంబర్ 16వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott