తెలుగు సినిమా పరిశ్రమలో ఫీల్ గుడ్ సినిమాలు చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. మాస్ ప్రేక్షకులను అలరించే దర్శకులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రేక్షకుల అభిరుచి మారింది. వారికీ ఫీల్ గుడ్ సినిమాలే నచ్చుతున్నాయి. అందుకే ఆ సినిమాలు తెరకెక్కించే దర్శకుల కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అలా "సీతారామం" సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి. అయన గత సినిమాలు కూడా ప్రేమ కథా సినిమాలే. అవి ప్రేక్షకులను బాగానే అలరించాయి. తొలి సినిమా నుంచి ఇలాంటి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఇప్పుడు సీతారామన్ సినిమా తో హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

అయితే అయన సినిమాలు కాన్సెప్ట్ పరంగా బాగుంటాయి కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతుందని కొంతమంది చెప్తున్నారు. ఆలా అయన గత సినిమా 'పడి పడి లేచే మనసు" డిజాస్టర్ సినిమా తీశాడు. అసలు ఈ సినిమా చేసింది ఇతనేనా అని అభిమానులు సైతం ఖంగుతినేలాగా ఆ సినిమా చేశాడు. అలా ఇప్పుడు చేసిన ఈ "సీతారామం" సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. హిందీ లో సైతం ఈ సినిమా కి మంచి పేరొచ్చింది. అక్కడ ఇటీవలే విడుదలై మంచి హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా వచ్చిన దగ్గరినుంచి అయన చేయబోయే తదుపరి సినిమా ఏంటా అని అందరు తెగ ఎదురుచూస్తున్నారు. ఇంతమంచి కాన్సెప్ట్ ను సినిమాగా చేసిన అయన ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తారో అందరి ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్మాతలు సైతం హను రాఘవపూడి ముందు క్యూ కడుతున్నారు. అయితే అయన సీతారామన్ లాంటి సినిమానే చేయబోతున్నాడు అని ఇప్పుడు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: