పవన్ కళ్యాణ్ హీరో గా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో ముందుగా హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్రీమేక్ సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తమిళ చిత్రం వినోదయ సిత్తం రీమేక్ కి వెంటనే డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. అదే వస్తుంది అనుకున్నారు అంతా.. ఈ చారిత్రాత్మక సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడక తప్పదని అనుకున్నారు.

కానీ మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు పూర్తి చేయకుండా రీమేక్ కి డేట్లు ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావించి ఈ సినిమానే మొదలుపెట్టాడని తెలుస్తుంది. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. వరుస గా ఆ సినిమా ను చేసి దానిని పూర్తి అయిన తర్వాతే వినోదయ సిత్తం రీమేక్ షురూ అయ్యే అవకాశం ఉందట. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ హీరో గా నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని అంటున్నారు.

పవన్ కళ్యాన్ ని మొదటి సారి పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో చూడబోతున్న నేపథ్యంలో అభిమానులలో ఈ సినిమా పట్ల ఆసక్తి ఎక్కువగా పెరిగింది. గతం లో పవన్ ఇలాంటి సినిమాల్లో నటించలేదు. అందుకే వారు చాలా ఆసక్తిగా ఉన్నారు.అయితే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతోనే పవన్ తన ఆలోచన మార్చుకున్నాడు. ఈ సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించేందుకు వరుస సినిమాలు చేయడం విశేషం. ఒకవైపు రాజకీయ కార్యాకలాపాలు ఇంకొకవైపు సినిమా పనులు ఏంటో తన డే లైఫ్ ను ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. మరి ఈ సినిమాల ద్వారా అయన ఎలాంటి విజయాన్ని అందుకుని తన అభిమానులను సంతోష పరుస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: