బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్ అలియా భట్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రహ్మాస్త్ర'. మన భారతీయ పురాణాల ఆధారంగా చేసుకోని ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రణ్ బీర్ కపూర్ అయాన్ ముఖర్జీ తో కలిసి మరి కొంత మంది ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ కు ముందు నుంచి భారీ బజ్ క్రియేట్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమాపై వున్న బజ్ కారణంగా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో తొలి రోజు భారీ స్థాయిలోనే ఈ మూవీ వసూళ్లని రాబట్టింది.తొలి రోజు ఈ మూవీ భారీ స్థాయిలో ప్రారంభ వసూళ్లని రాబట్టింది. ఇండియా వైడ్ గా రూ. రూ. 35 కోట్లకు మించి వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా వైరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 75 కోట్లు గ్రాస్ రాబట్టి నట్టుగా చిత్ర వర్గాలు వెళ్లడించాయి. ఎలాంటి హాలీడే లేని సమయంలో విడుదలైన ఈ మూవీ ఈ స్థాయి వసూళ్లని రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. వీకెండ్ లో ఈ మూవీ అవలీలగా రూ . 150 కోట్ల మార్కుని కూడా దాటి 160 కోట్లు సాధించడం జరిగింది.అయితే సోమవారం అనగా ఈరోజు చిత్ర వర్గాలు ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.225 కోట్ల గ్రాస్ ని రాబట్టిందని ప్రకటించాయి. విమర్శకులు ప్రేక్షకుల నుంచి తొలి రోజు ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినా కూడా వసూళ్లు మాత్రం ఆశాజనకంగా వుండటం విశేషం.


టాక్ కు వసూళ్లకు సంబంధం లేకుండా ఈ సినిమా వసూళ్లని రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరగడం ఓ కారణం కాగా వీకెండ్ కావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.అయితే కొంతమంది ఇవి ఫేక్ లెక్కలు అంటున్నారు. అయితే ఇవన్నీ పక్కనపెడితే 'బ్రహ్మాస్త్ర'కు అసలు టెస్ట్ ఈరోజు నుంచే మొదలైంది. ఈ రోజు భారీ వసూళ్లని రాబట్టగలిగితేనే ఈ సినిమా నిలబడుతుంది లేదంటే పినిమా బాక్సాఫీస్ వద్ద క్రమ క్రమంగా తగ్గుతూ వెళుతుంది.  తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.ఇదిలా వుంటే ఇప్పటికే ఈ మూవీ హిందీలో రూ. 100 కోట్ల మార్కుని క్రాస్ చేయడంతో ట్రేడ్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీ మండే టెస్ట్ ని విజయవంతంగా పాస్ కావాలని ట్రేడ్ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. 'బ్రహ్మస్త్ర' మండే టెస్ట్ ని పాస్ అయితే ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి తిరుగు వుండదని అంటున్నారు. మరి చూడాలి ఏమవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: