కోలీవుడ్ లో సంచలన డైరెక్టర్ గా పేరుపొందాడు లోకేష్ కనకరాజు.. తన తదుపరిచిత్రం పై నెలకొన్న ఎగ్జిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కార్తి నటించిన ఖైదీ.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించారు డైరెక్టర్ లోకేష్. ఎంతోమంది బడా హీరోలు సైతం ఈ దర్శకుడితో నటించడానికి సిద్ధంగా ఉన్న వారందరిని పక్కనపెట్టి.. లోకేష్ తన తదుపరిచిత్రాన్ని హీరో విజయ్ తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పైన అభిమానులతో సహా సినీ ప్రేక్షకులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక వారికి తగ్గట్టుగానే విజయ్ పాత్రని గ్యాంగ్ స్టార్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక హీరోని గ్యాంగ్ స్టార్ పాత్రలో ఎలా ఎలివేట్ చేస్తాడో అనే విషయం గత సినిమాలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక ఈ పాత్ర ఈ సినిమాలో మరొక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం హీరో విజయ్ ని డి కొట్టడానికి ఏకంగా బాలీవుడ్ నటుడిని రంగంలోకి దించుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ నటుడు ఎవరో కాదు సంజయ్ దత్.



ఈ మధ్యకాలంలో అన్ని విలన్ పాత్రలలో ఎక్కువగా ఈ నటుడు నటిస్తున్నాడు. ఒకవేళ ఇదే విషయం నిజమైతే ఈ సినిమా మరింత హైప్ క్రియేట్ చేస్తుంది అని అభిమానుల సైతం భావిస్తున్నారు. గతంలో కూడా కేజిఎఫ్ -2 లో  అదిరా పాత్రలో అందరిని ఆకట్టుకున్నాడు సంజయ్ దత్. ఇక బాలీవుడ్ లో రూ. 100 కోట్ల రూపాయలు సాధించింది అంటే దాని వెనుక సంజయ్ దత్ ప్రమేయం ఉందని చెప్పవచ్చు. ఇక పాత్ర నచ్చడంతోనే లోకేష్ కనకరాజు తన తదుపరి చిత్రంలో ఈ హీరోని విలనగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాత్ర కోసం సంజయ్ దత్తు కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: