‘బాహుబలి’ తో జాతీయస్థాయి ఇమేజ్ ని అందుకున్న రాజమౌళి ఒకసినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాడు అంటే ఆమూవీ పై అందరిలోనూ ఆశక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటి రాజమౌళి స్వయంగా ప్రమోట్ చేయడమే కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించడంతో ఆమూవీ పై మరిన్ని భారీ అంచనాలు పెరిగాయి.


ఈమూవీ విడుదల అయిన తరువాత ఈమూవీని చూసిన ప్రేక్షకులు ఈమూవీలో రాజమౌళి చెప్పినంత గొప్పతనం ఏముంది అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈమూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని భావించారు. అయితే ఆమూవీకి వచ్చిన టాక్ ను పరిశీలిస్తే ఈమూవీ యావరేజ్ హిట్ అన్న టాక్ నడుస్తోంది.


దీనికితోడు ఈమూవీ సెకండ్ హాఫ్ లో వచ్చిన గ్రాఫిక్స్ చాల లో క్వాలిటీగా కనిపించడంతో గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి రాజీపడని రాజమౌళి సమర్పించిన ‘బ్రహ్మాస్త్రం’ లో ఇలాంటి లో క్వాలిటీ గ్రాఫిక్స్ ఎందుకు ఉన్నాయి అంటూ సగటు ప్రేక్షకుడు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ‘ఈగ’ ‘మగధీర’ ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలు వరసగా తీస్తూ తన గ్రాఫిక్ మాయాజాలం ఏమిటో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా రాజమౌళి ప్రవర్తిస్తూ వచ్చాడు.


అయితే అలాంటి రాజమౌళి సమర్పించిన ఒక భారీ సినిమాలో లో క్వాలిటీ గ్రాఫిక్స్ వల్ల రాజమౌళి ఇమేజ్ దెబ్బతింటుంది కదా అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. గతంలో రాజమౌళి ప్రమోట్ చేసిన కొన్ని చిన్నసినిమాలను చూసిన ప్రేక్షకులు ఇలాంటి చిన్న సినిమాలను జక్కన్న ఎందుకు ప్రమోట్ చేసాడు అంటూ ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రాజమౌళి ప్రవర్తిస్తూ ఉంటే అతడి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ఆస్కారం ఉందని అతడి అభిమానులు చాల భయపడుతున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో జక్కన్న సరైన న్యాయం చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో కూడ రాజమౌళి అంచనాలు తారుమారు అయ్యాయా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: