తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన శర్వానంద్ తాజాగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టైమ్ ట్రావలింగ్ జోనర్ లో తెరకెక్కింది. ఈ మూవీ లో రీతు వర్మ , శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించగా ,  వెన్నెల కిషోర్ ,  ప్రియదర్శి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఉండడం వల్ల ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించడంతో ఒకే ఒక జీవితం మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.51 కోట్ల షేర్ , 10.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ని అందుకోవాలి అంటే ఇంకా 2.49 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: