మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా , లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో విలక్షణ నటుడు సత్యదేవ్ కనిపించ బోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుండి నయన తార మరియు సత్యదేవ్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ విడుదల చేసింది. గాడ్ ఫాదర్ మూవీ లోని ఫస్ట్ సాంగ్ ప్రోమో ని ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ,  అలాగే పూర్తి సాంగ్ ని 15 సెప్టెంబర్ 2022 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ పై మెగా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: