సినిమా పరిశ్రమలో ఎప్పుడు వివాదాలతో కాపురం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలనం సృష్టించాడు. ఎప్పుడూ వివాదాల‌తో వార్త‌ల్లో ఉండే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎక్కువ అందరి ఫోకస్ తనపై ఉండే విధంగా చేసుకుంటాడు. ఎంతమంది వచ్చినా తనకు సాటి లేదు అన్నట్లుగా అయన వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. అలా ఆయ‌న మ‌రోసారి త‌న్ ట్విట్ట‌ర్ ద్వారా సినీ పెద్ద‌ల‌ను టార్గెట్ చేశారు. ట్విట్టర్ వచ్చిన దగ్గరినుంచి దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అయన ట్వీట్స్ చేస్తూ అందరిని పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ ఉంటాడు.

అలా తాజాగా సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కృష్ణంరాజు ఆదివారం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ సెన్సిటివ్ విషయాన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో ట్విట్టర్ లో వివాదం చేశారు. అంత పెద్ద నటుడు, ప్రముఖ హీరో అయినా కృష్ణం రాజు చనిపోవడం ఒక్కసారిగా అందరిని ఎంతో ఉలిక్కిపాటుకు గురిచేసింది. సినిమా ఇండస్ట్రీ లోని సినీ పెద్ద‌లు, ఇత‌ర న‌టీన‌టులు ఆయ‌న ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. అయన పోవడం పట్ల అందరు ఎంతో కలత చెందారు. అంతేకాదు రామ్ గోపాల్ వర్మ కూడా అయన మరణం పట్ల చింతిస్తూనే ట్విట్టర్ లో టాలీవుడ్ లోని కొంతమంది పెద్ద హీరోలపై విమర్శలు చేశారు.

నిన్న సోమ‌వారం ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను హైద‌రాబాద్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌ సినిమా ఇండ‌స్ట్రీ కృష్ణంరాజుకి స‌రైన వీడ్కోలు ఇవ్వ‌లేద‌ని, అత్యంత స్వార్ధ‌పూరిత సినిమా పరిశ్ర‌మ ఇదేనంటూ సినీ పెద్ద‌లైన కృష్ణ‌, ముర‌ళీ మోహ‌న్‌, చిరంజీవి, మోహ‌న్‌బాబు, బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై ఆయ‌న కామెంట్స్ చేయ‌టం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా నిన్న ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లు ఇచ్చి విజయ్ దేవరకొండ గురించి, సినిమా పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తి కార వ్యాఖ్యలు చేశారు. బాయ్ కాట్ పై కూడా అయన పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్కృతి సినిమా ఇండస్ట్రీ కి మంచిది కాదని కూడా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: