టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాపై ఎంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇక భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బోల్తా కొట్టడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ విజయ్ దేవరకొండపై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మరియు సోషల్ మీడియాలో విజయ పై దారుణంగా కామెంట్స్ కూడా చేశారు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ విజయ్ మాత్రం ఏవిధంగాను స్పందించలేదు. కానీ లైగర్ సినిమా తరువాత సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్చే శారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సందర్భంగా ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్చే శారు ఆ యన . అందులో సింగిల్ ప్లేయర్ అంటూ విజయ్ దేవరకొండ కృష్ణంరాజు కి సంతాపం తెలుపుతూ పోస్ట్చే శారు. అయితే ఆ పోస్ట్ఏం టో అర్థం కాక నెటిజన్లు దీని అర్థం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే సింగిల్ ప్లేయర్ అంటూ విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్టులో విజయ్ దేవరకొండ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే ఫోటో వరకు ప్రాబ్లం లేకపోయినా సింగిల్ ప్లేయర్ అన్న పదం ఎందుకు ఉపయోగించారు అన్నది అర్థం కాక నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

  ఇదే విషయంపై అనేక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పై అందరికంటే భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఒక్కసారిగా డిజాస్టర్ కావడంతో విడుదలకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం అంతా కూడా నీరు కారిపోయినట్టు అయింది. అంతేకాకుండా ప్రేక్షకులు అందరు ఆర్ఆర్ఆర్ మరో తెలుగు పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతోంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మనిపించింది. దీంతో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదల తర్వాత ఎక్కడా కూడా ఆ సినిమా గురించి ప్రస్తావన తీసుకురాకుండా తన తదుపరి సినిమా అయినా ఖుషి సినిమా షూటింగ్లో బాగా బిజీ బిజీగా మారిపోయాడు. అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తీయబోతున్న మరొక సినిమా జనగణమన. ఈ సినిమా గురించి లైగర్ సినిమా విడుదల తర్వాత ఎక్కడ కూడా మాట్లాడటం లేదు ఆయన . దీంతో ఈ ప్రాజెక్టు ఉంటుందా ఊడిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ సింగిల్ ప్లేయర్ అనే పోస్ట్ చేయడానికి ఈ విషయం కూడా కారణం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ తదుపరి సినిమా ఖుషి హిట్ అయితే పర్లేదు కానీ లేదంటే ఇక ముందు ముందు అవకాశాలు కూడా రావడం కష్టమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: