దర్శకుడు శ్రీనువైట్ల ఒకప్పుడు టాప్ డైరెక్టర్ స్థానాన్ని ఎంజాయ్ చేస్తూ అనేకమంది టాప్ హీరోలకు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతడికి కాలం కలిసి రాకపోవడంతో వరసపెట్టి ఫ్లాప్ లు తీస్తున్నాడు. దీనితో ఇతడి పెరుచేపితే ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోలంతా భయపడిపోతున్నారు అన్న వార్తలు వినిపించాయి.  


దీనితో అతడికి అవకాశాలు రావడం పూర్తిగా కనుమరుగై పోయాయి. ఇలాంటి పరిస్థితులలో హీరో గోపీచంద్ శ్రీనువైట్ల ను నమ్మి ఒక అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గోపీ మోహన్ వ్రాసిన ఒక కథకు శ్రీనువైట్ల తనదైన రీతిలో స్క్రీన్ ప్లే వ్రాసుకుని అనేకమంది మీడియం హీరోల చుట్టూ తిరితే ఏ హీరో శ్రీనువైట్ల వైపు చూడకపోయినప్పటికీ గోపీచంద్ శ్రీనువైట్ల చెప్పిన కథ విని అతడికి అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం గోపీచంద్ వరస ఫ్లాప్ లలో ఉన్నాడు అయినప్పటికీ అవకాశం వచ్చిన సినిమాలు ఏమి వదులుకోకుండా ఏదో ఒక సినిమాతో హిట్ కొట్టి తిరిగి ట్రాక్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్యనే రాశి ఖన్నా తో ఒక మూవీ చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు శ్రీనువైట్లకు కూడ అవకాశం ఇవ్వడంతో గోపీచంద్ ఏధైర్యంతో శ్రీనువైట్ల కు అవకాశం ఇచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.


ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు కామెడీ ట్రాక్ ను జత చేసి చాల విజయవంతమైన సినిమాలు తీసిన ట్రాక్ రికార్డు శ్రీనువైట్ల సొంతం. ప్రస్తుతం గోపీచంద్ తో మళ్ళీ అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మారుతిని నమ్ముకుని గోపీచంద్ ఇలాంటి ప్రయోగమే ‘పక్కా కమర్షియల్’ అంటూ చేసాడు అయితే ఆ ప్రమోగం ఫలించలేదు. ఇప్పుడు శ్రీనువైట్ల తో చేయబోతున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి. శ్రీనువైట్లను నమ్మి అతడికి వచ్చిన ఆఖరి అవకాశం అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: