టాలీవుడ్ ఇండస్ట్రీలో వెర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు  గురించి మనకి తెలిసిందే. అయితే ఈయన నటించిన తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా' త్వరలో రిలీజ్ కానుంది.అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేసింది.ఇక ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొంటున్న సుధీర్ బాబుని పలు రకాల ప్రశ్నలు వేసి, ఆసక్తికరమైన సమాధానాలు రాబడుతున్నారు మీడియా మిత్రులు. ఇకపోతే ఈ క్రమంలో మహేష్ బాబు గురించి అడిగిన ఓ విచిత్రమైన ప్రశ్నకు సుధీర్ బాబు నుంచి వచ్చిన సమాధానం కూడా అంతే విచిత్రంగా వుండడం మరో విచిత్రం.

ఇదిలావుంటే ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే మహేష్ బాబు నటించిన '1 – నేనొక్కడినే' చిత్రం గురించి తెలిసిందే. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లో డిజాస్టర్‌గా చెప్పుకోవచ్చు. అయితే, ఇక  ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం సుధీర్ బాబుకు నచ్చలేదట.ఇక ఇంటెలిజెంట్ స్ర్కీన్‌ప్లేతో సాగిన ఈ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమనీ,

ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా ఆదరించకపోవడం ఒకింత బాధాకరమనీ సుధీర్ బాబు చెప్పాడు. అయితే అసలెందుకు సుధీర్ బాబు ఈ సినిమా గురించి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటే, మహేష్ పాత సినిమాల్లో ఏ సినిమాల్లో మళ్లీ నటిస్తే బావుంటుంది.? అని అడిగిన ప్రశ్నకు సుధీర్ బాబు నుంచి వచ్చిన రెస్పాన్సే ఇది.ఇకపోతే మహేష్ బాబు '1 – నేనొక్కడినే' సినిమాని మళ్లీ చేస్తే బావుంటుందేమో అన్నాడు సుధీర్ బాబు.అయితే  కానీ, అది సాధ్యపడే విషయమేనా.? ఒకవేళ మహేష్ చేయకపోతే, ఆ సినిమాని సుధీర్ బాబు మళ్లీ చేసేస్తాడేమో.! అన్నట్లు మహేష్ తనయుడు గౌతమ్ ఈ సినిమాలో నటించాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: