ఫలితం ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఇటీవలే 'ఆచార్య'తో చిరు భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు మన మెగాస్టార్.

ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానుల ను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టి ని పెట్టాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ చిత్రం సంక్రాంతి రేసులో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ అధికారికంగా ప్రకటన రాగా, విజయ్ ‘వారసుడు’ కూడా సంక్రాంతికి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరీ ఈ రెండు సినిమా పోటీలను తట్టుకుని బాస్ గెలుస్తాడా? లేదా? అని చూడాలి. అసలు ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఈ చిత్రంలో మెగాస్టార్ అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్‌ గెస్ట్ రోల్ కూడా ఉండనున్నట్లు సమాచారం.టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదల అయి భారీ విజయాన్ని అందుకున్నాయి. నార్మల్ గా వున్న కథలు కూడా సంక్రాంతి సీజన్ లో అద్భుత విజయాన్ని అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: