ఏదైనా ఉండాల్సినంత ఉంటేనే అర్థం. అది కనుక అతిగా మారితే కష్టమే. ఇది దేనికైనా కానీ వర్తిస్తుంది. అభిమానముంటే మనసులో ఉంచుకోవాలి కానీ బయట పెట్టాలని ప్రయత్నించడం కూడా ఒక్కోసారి చాలా వివాదాలకు దారితీస్తుంది.


నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన కోసం ఏం చేయడానికైనా కూడా సిద్ధమే. ముద్దుగా దేవర అని పిలుచుకునే గణేష్ సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులతో అభిమానుల్లో ఆగ్రహం కలిగేలా చేస్తున్నాడు. అభిమానం కాస్త వెర్రితలలు వేస్తుండటంతో సహజంగా అందరిలో కోపం వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అతడిలోని పిచ్చి ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.


దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు నీకో దండం రా బాబూ మా అన్నను వదిలేయ్. ఇలాంటి పోస్టులు పెడుతూ ప్రేక్షకులను పక్కదారి పట్టించకు. ఇక చాలు నీ వ్యక్తిగత విషయాలు బహిరంగంగా రుద్దొద్దు అని కామెంట్లు పెట్టడం మామూలైపోయిందట . పవన్ కల్యాణ్ అంటే అందరికి అభిమానమే. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. కానీ ఇలా బహిరంగంగా తోచిన విధంగా చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. అందుకు బండ్ల గణేష్.. జర జాగ్రత్త అంటూ పలువురు నెటిజన్లు సైతం హితవు పలుకుతున్నారు.


ఓ సినీ వేడుకలో అడివి శేషు, డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. ఈ ఫొటోకు పవన్ కల్యాణ్ చేతులు కట్టుకుని కూర్చున్న ఫొటోలు జత చేసి నమస్కారానికి నిలువెత్తు నిదర్శనమని కామెంట్ పెట్టడంతో ప్రేక్షకుల్లో బాగా ఆగ్రహం కలిగింది. అది నమస్కారం కాదు సంస్కారం ముందు నువ్వు భాష నేర్చుకో అని కౌంటర్ ఇస్తున్నారట.పైగా ఎక్కడివో ఫొటోలు తెచ్చి ఇలా చేయడం నీ స్థాయికి తగదని హితవు పలుకుతున్నారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇలా సామాజిక మాధ్యమాల్లో పెడుతూ పవన్ కల్యాణ్ పరువు తీయకు అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: