అనసూయ పుణ్యమా అని చేతినిండా సంపాదించుకుంటుంది యాంకర్ రష్మీ గౌతమ్. సినిమాలు లేకపోతేనే.. జబర్థస్త్ రెండు ప్రోగ్రామ్స్ తో హ్యాండ్ బ్యాగ్ నింపుకుంటోంది

ఇంతకీ రష్మీ గౌతమ్ జబర్థస్త్..ఎక్ట్సాజబర్థస్త్ ద్వారా ఎంత సంపాదిస్తోంది..?

 
రష్మి గౌతమ్ జబర్థస్త్ యాంకర్ గా ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంటర్ అయినా..ఆమెపాపులర్ అయ్యింది మాత్రం జబర్థస్త్ యాంకర్ గానే. యాంకరింగ్ చేస్తూనే.. .. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పచ్చి అందాలు ఆరబోస్తూ.. విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది రష్మీ.

ఇక ఇది ఇలా ఉంటే రష్మి గౌతమ్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో అనసూయ కొన్ని షోలు చేసి వెళ్లిపోయిన తరువాత రష్మీ జబర్థస్త్ ను నడిపించింది.. బాగా పాపులర్ అయ్యింది. ఆతరువాత రెండు జబర్థస్తులగా విడిపోయిన తరువాత ఎక్ట్రా జబర్థస్త్ కు రష్మీ యాంకర్ గా మారింది. స్టార్ యాంకర్ గా రష్మీ ఒక్క షోకు... గతంలో 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకూ తీసుకునేదని సమాచారం.

 
అయితే రీసెంట్ గా జబర్థస్త్ నుంచి అనసూయ వెళ్లిపోవడం రష్మీకి కలిసి వచ్చింది... ఆ షోబాధ్యతను కూడా రష్మీ మీదనే పెట్టారు మేకర్స్. దాంతో రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది. ఎవరు జబర్థస్త్ ను వీడిపోతున్నా.. రష్మీ మాత్రం నమ్మకంగా ఉంటోంది. దాంతో రష్మీ అడిగినంత రెమ్యూనరేషన్ ను ఆమెకు ముట్టజెప్పారట మేనేజ్ మెంట్. ఇక జబర్థస్త్.. ఎక్ట్రా జబర్థస్త్ రెండు కలిపి ఎపిసోడ్ కు మూడు లక్షల పైనే తీసుకుంటుందట రష్మీ.

 
ఇవి కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ.. దానితో పాటు పండగ స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటూ.. మరికొన్ని లక్షలు తన బ్యాగ్ లో వేసుకుని పోతుందట రష్మి. అంతే కాదు అడపా దడపా సినిమా ఛాన్సులు వస్తుంటే.. డేట్స్ అజెస్ట్ అయితే నటించేస్తుందట చిన్నది. అటు సినిమాల నుంచి కూడా ఆమెకు అప్పుడప్పుడు సంపాదన బాగానే ఉంది.

 
ఇక మరీ ముఖ్యంగా రష్మీ హాట్ హాట్ పోటో షూట్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతుంటుంది. ఇన్ స్ట్రాలో ఆమె అందాల ఆరబోతకు కూడా లక్ష్లల్లో సంపాదన వస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ స్టాలో ఆమో ఫాలోవర్లు పెరిగే కొద్ది సంపాదన కూడా పెరుగుతుంది. ఇలా అన్నివైపుల నుంచి రష్మీ గౌతమ్ ఎడా పెడా సంపాదిస్తోంది.

 
ఇక రష్మీ హీరోయిన్‌గా నటించిన గుంటూరు టాకీస్ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది

 
రష్మీలో మరో కోణం కూడా ఉంది. సామాజిక అంశాలపై స్పందించడం ఆమెకు బాగా అలవాటు. మహిళలపై దాడులు... మూగజీవాలను హింసించడం లాంటివి ఆమె సహించలేదు.. వెంటనే ఘాటుగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సోషల్ మీడియా దికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: