టాలీవుడ్, బాలీవుడ్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రెండు ఇండస్ట్రీల మధ్య భేదాలేప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇక టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలను కేర్ కూడా చేసేవాళ్లు కాదు బాలీవుడ్ వాళ్లు.

అలాంటిది గతకొంతకాలంగా... సౌత్ సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇది థియేటర్లలోనే కాదు.. హిందిలో డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టిన తెలుగు సినిమాలకు కూడా. హిట్ అయిన సినిమాలతో పాటు... యావరేజ్ టాక్ వచ్చిన మూవీస్ కి సైతం... మిలియన్స్ వ్యూవ్ వస్తున్నాయి.

ఒక్కపుడు తెలుగు సినిమా అంటే తక్కువ చేసి చూసేవారు. మన హీరోలు వేరే భాషల్లో సినిమా తీసిన డబ్ చేసిన వేరే ఇండస్ట్రీల్లో కనీసం ప్రోత్సహించే వారు కూడా ఉండేవాళ్లు కాదు. అది ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన హీరో అయినా సరే. వెండతెర మెగాస్టార్ చిరంజీవి అయినా సరే. అప్పట్లో తమిళ్ సినిమా జెంటిల్ మెన్ ని హిందీ లో రీమేక్ చేశారు కానీ అక్కడ విజయం సాధించలేదు... ఇంకొన్ని సినిమాలని కూడా హిందీ ప్రేక్షకులు తిరస్కరించారు. ఇక టాలీవుడ్ నుంచి నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి హీరోల మూవీస్ ని కూడా అడపాదడపా హిందీలోకి డబ్ చేసినా సరైన విజయాలు అందుకోలేదు. కానీ ఇదంతా ఒక్కప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సినిమా అంటే ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. మన సినిమాలకి తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇక యూట్యూబ్ లో హిందీ జనాలు మన తెలుగు డబ్బింగ్ సినిమాలు అంటే పడి చస్తున్నారు. మన తెలుగు హీరోల బొమ్మ కనిపిస్తే చాలు పేర్లు చెప్పేస్తున్నారు.

హిందిలోకి డబ్ చేసిన తెలుగు సినిమాలకి కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి సినిమాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నరు నార్త్ ఇండియన్స్. ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సరైనోడు. ఇందులో యాక్షన్ సీన్ లని చూసి హిందీ జానాలు అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయారు. దీంతో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టిన సరైనోడి సినిమాకి 82 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్ లు నటించిన చిత్రం అ ఆ... ఈ సినిమాలో అప్పట్లోనే 50 కోట్లకు పైనే వసూల్ చేసింది. దీన్ని హిందిలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే.. దాదాపు 457 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నితిన్ మరో సినిమా చెక్ కి 157 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనిలియ హీరోహీరోయిన్ లుగా నటించిన చిత్రం ఆరేంజ్. మగధీర తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం... తెలుగు ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ టీవీలలో ప్రసారం అయ్యేసరికి ఆరేంజ్ మూవీ బాగా ఆకట్టుకుంది. హిందీలో డబ్ చేసిన ఈ సినిమాని 228 మిలియన్ల మంది యూట్యూబ్ లో వీక్షించారు. ద్రువ సినిమాకి 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి.దీంతో పాటు కార్తికేయ హీరోగా నటించిన రాజ మిక్రమార్కకి 35 మిలియన్ వ్యూస్.. రామ్ పోతినేని హీరోగా నటించిన ఉన్నది ఒక్కటే జిందాగి తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాని హిందీలో డబ్ చేసి.. నంబర్ వన్ దిల్ వాలా పేరుతో యూట్యూబ్ లో పిడితే 257 మిలియన్ల మంది చూశారు. దీంతో పాటు అల్లు అర్జున్ రేసుగుర్రం, మహేష్ బాబు శ్రీమంతుడు, ఎన్టీఆర్ టెంపర్ తో పాటు.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలని హింది డబ్ చేస్తే... కోట్ల మంది చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: