దక్షిణాదిన అగ్ర దర్శకుడిగా ఉన్న శంకర్ ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాను చేస్తున్నాడు.  భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వాస్తవానికి శంకర్ కు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందని చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించక పోవడం ఆయన  మొదలుపెట్టిన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఆయన ఎన్నో చిక్కులలో ఇరుక్కున్నాడు.

ఇటువంటి సమయంలోనే తెలుగులో ఈ దర్శకుడు ఇంత పెద్ద హీరోతో సినిమా చేయడం నిజంగా ఆయనకు ప్లస్ అవుతుందని చెప్పాలి. ఈ సినిమాతో మంచి కం బ్యాక్ చేయాలని భావిస్తున్న శంకర్ కు మొదటి నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయని చెప్పాలి. ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఆలస్యంగా మొదలు పెట్టడంతో పాటు ఇప్పటిదాకా చేసినా షూటింగ్ అవుట్ ఫుట్ పట్ల రామ్ చరణ్ సంతృప్తిగా లేకపోవడంతో దానిని ఏ విధంగా సరి చేయాలన్నా ఆలోచనలో శంకర్ ఉన్నాడట. 

ఇప్పటికైతే ఈ సినిమాను ఆపేసి తదుపరి సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడట చరణ్. ఆ సినిమా యొక్క అవుట్ ఫుట్ ను సరిచేసి తనకు నచ్చేలా ఉంటేనే దానిని కంటిన్యూ చేస్తానని రామ్ చరణ్ చెబుతున్నాడట. సగభాగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసిన ఈ సినిమాను మధ్యలో ఆపేయడం అంటే నిర్మాతకు భారీ స్థాయిలో నష్టం వస్తుందని చెప్పాలి. ఇంకో వైపు కన్నడ దర్శకుడు నర్తన్ తో కలిసి త్వరలోనే రామ్ చరణ్ ఓ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక వైపు గౌతమీ తిననూరి దర్శకత్వంలో సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ సినిమా బయటపడాలి అంటే తప్పకుండా ఈ సినిమా యొక్క అవుట్ ఫుట్ ను బాగా సరిచేసి చరణ్ కు నచ్చే విధంగా చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: