వెంకటేష్ హీరోగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఇందులో రానా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు కూడా కలిసి నటిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కూడా ఒకే సిరీస్ లో నటిస్తూ ఉండడం ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ ఎదురుచూస్తున్న సమయంలోనే కొంతమంది వెంకటేశ్ అభిమానులు వెంకటేష్ యొక్క కొత్త సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో ఇప్పటిదాకా తన తదుపరి సినిమా ఏం చేస్తున్నాడో కూడా వెల్లడించకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలువురు దర్శకుల కథలు విన్న వెంకటేష్ వాటిని రిజెక్ట్ చేయడంతోనే ఇంత గ్యాప్ వచ్చిందని లేదంటే ఎప్పుడో తన సినిమాను మొదలు పెట్టే వాడినని ఆయన తన సన్నిహితుల వద్ద వెల్లడిస్తున్నారు. తాజాగా వెంకటేష్ కు ఓ కథ నచ్చిందని త్వరలోనే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

యువ దర్శకుడు తో కలిసి ఆయన ఈ సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు. మరి విక్టరీ సినిమా వెండితెరపై చూసి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో వారి సంతోషం కోసం త్వరలోనే సినిమాను మొదలు పెట్టవలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతానికైతే వెంకటేష్ తన తదుపరి సినిమాను ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ మారిన నేపథ్యంలో ఎక్కువమంది ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను చూస్తున్న నేపథ్యంలో ఓటీటీ లకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వెంకటేష్ కూడా ఈ విధంగా ట్రెండ్ మార్చి ఇక్కడ సినిమాలలో చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఒక పాత్ క్రియేట్ చేస్తున్నారు వెంకటేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: