బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇంకా ఆయన అతిథి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ కి ఇటువంటి మంచి గుణాలన్నీ తన పెదనాన్న కృష్ణంరాజు నుండి నేర్చుకున్నాడు.ఇటీవల కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కృష్ణంరాజు మరణించాడు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇప్పటికీ ఆయన మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో నిర్వహించారు.అయితే పెదనాన్న చనిపోయిన బాధలో కూడా ప్రభాస్ తన అభిమానుల గురించి ఆలోచించాడు. కృష్ణంరాజు అంతిమయాత్రకు హాజరైన అభిమానుల కోసం ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయించాడు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులందరినీ భోజనం చేసి వెళ్లమని కోరాడు.


అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ అభిమానులతో మాట్లాడుతున్న వీడియోని షేర్ చేశారు. పెదనాన్న చనిపోయిన బాధలో ఉన్న ప్రభాస్ అంతటి బాధలో కూడా తన అభిమానుల గురించి ఆలోచించటంతో ప్రభాస్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రభాస్ తన అభిమానులతో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు అందరికీ కడుపునిండా భోజనం పెడుతూ ఉంటాడు. షూటింగ్ సమయంలో కూడా తన ఇంటి నుండి భోజనం తెప్పించి మరి సెట్ లో ఉన్న అందరికీ రుచికరమైన భోజనాలు వడ్డిస్తాడు. అయితే ఈ అలవాటును కృష్ణంరాజు నుండి ప్రభాస్ నేర్చుకున్నాడు. కృష్ణంరాజు కూడా ఎప్పుడు తన ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు చేసి కడుపునిండా భోజనం పెట్టి పంపుతుంటాడు. దీంతో కృష్ణంరాజు పేరు మర్యాద రామన్నగా మారిపోయింది. ఇలా ప్రభాస్ కూడా తన పెదనాన్న లాగే ఆలోచించడంతో అందరు హీరోల అభిమానులు ఈయనపై ప్రశంసల కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: