ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.


వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని సమాచారం.. కేవలం 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమయ్యారు.


ఈ దర్శకుడు కొత్త దర్శకుడు కావడం వల్లే పెద్దగా అంచనాలు లేకుండా ఒకే ఒక జీవితం సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాను రిజక్ట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ అని సమాచారం. చాలా సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నోటా సినిమాలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ సాధించలేదు.


  ఈ సినిమా ఫలితం వల్ల తమిళ దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో ఒకే ఒక జీవితం సినిమాలో నటించడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపలేదట. ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని చెప్పవచ్చు. అయితే శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారని సమాచారం.త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసిన ఈ డైరెక్టర్ విజయ్ దేవరకొండ కోసం కూడా ఎలాంటి కథను సిద్ధం చేస్తారో చూడాలి మరి. ఇతర డైరెక్టర్ల కథలకు భిన్నమైన కథలను తయారు చేయడం ద్వారా ఈ డైరెక్టర్ వార్తల్లో నిలుస్తున్నారట  .

మరింత సమాచారం తెలుసుకోండి: