బాలకృష్ణ ఎంత ఆవేశపరుడో అంత స్నేహశీలి సినిమా షూటింగ్ సమయంలో తన తోటి సహ నటీనటులతో చాల సరదాగా ఉండటమే కాకుండా బాలయ్య వేసే జోక్స్ తో షూటింగ్ స్పాట్ నవ్వులతో నిండిపోతుంది అని అంటారు. బాలయ్య మరీ ఆనందంగా ఉంటే తన సహ నటీనటులను తనను ‘సార్’ అని పిలవకుండా ‘బాల’ అని పిలవమని చెపుతూ ఉంటాడట.




తాను నటించే సినిమాల షూటింగ్ గ్యాప్ లో బాలకృష్ణ సరదాగా పాటలు పద్యాలు పాడుతూ అందర్నీ జోష్ లో ముంచెత్తి వేస్తాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న మూవీ చివరి షెడ్యూల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను వేగంగా పూర్తిచేసి రాబోతున్న క్రిస్మస్ కు కానీ లేదంటే సంక్రాంతికి కానీ విడుదలచేయాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ మూవీలో కమెడియన్ సప్తగిరి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ఇస్తాంబుల్ లో ఉంది. ఈమూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణ సప్తగిరి మధ్య పౌరాణిక చిత్రాల డైలాగ్ లకు సంబంధించిన చర్చ వచ్చిందట. ఈ నేపథ్యంలో బాలయ్యతో పోటీపడి సప్తగిరి పౌరాణిక డైలాగ్ లు చెప్పడంతో బాలకృష్ణ షాక్ అయ్యాడట. అంతేకాదు సప్తగిరి స్పీడ్ చూసి సరదాగా సప్తగిరిని ‘నీ కాళ్లు పైకి ఎత్తు దండం పెడతా ఇక్కడితో వదిలేయ్’ అంటూ జోక్ చేసాడట. ఇప్పుడు ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి అనీల్ రావిపూడి దర్శకత్వంలో తీయబోయే మూవీ కోసం బాలయ్య రెడీ అవుతున్నాడు. ఈమూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రకు సంబంధించి 60 సంవత్సరాల వృద్ధుడుగా బాలయ్య కనిపించడానికి రెడీ అవుతున్నాడు. సీనియర్ హీరోలలో బాలయ్య ఒకవైపు సినిమాలు కొనసాగిస్తూ మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ ఈ రెండు పాత్రలను చాల సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: