తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ పేరు సంపాదించుకున్నారు రామ్ చరణ్ ఉపాసన. వీళ్లిద్దరూ కూడా ఒకరిపై ఒకరు ఎంతో అమితమైన అభిమానం  ప్రేమను కలిగి ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అంతేకాదు వీరిని చూసి ఎన్నో జంటలు అసూయ పడుతూ ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య దాంపత్య బంధం మొదలై 10 ఏళ్ళు గడిచి పోతుంది అన్న విషయం తెలిసిందే. 2012 జూన్ 14వ తేదీన వీరిద్దరు పెళ్లి తో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.


 అతిరథ మహారథుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా రాంచరణ్ ఉపాసనల పెళ్లి జరిగింది ఇక పెళ్లి తర్వాత వీరిద్దరు కూడా ఎంతో బిజీ బిజీ గానే ఉన్నారు. రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే ఉపాసన రామ్ చరణ్ బాగోగులు చూసుకోవడమే కాదు తన బిజినెస్ లను కూడా చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది అని చెప్పాలి. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి ఫిక్స్ కావడానికి ముందు ఒక స్టార్ హీరో కూతురుతో పెళ్లి జరగాల్సి ఉంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత తో ఇక రామ్ చరణ్ కు పెళ్లి అనుకున్నారట. చిరంజీవి వెంకటేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం.. వీరిద్దరి మధ్య దశాబ్దాల నుంచి మంచి స్నేహ బంధం ఉండడంతో వెంకటేష్ చిరంజీవి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించాడట.  చిరంజీవి కూడా ఒప్పుకున్నాడట. అయితే రామ్ చరణ్ కు చిరంజీవి ఈ విషయం చెప్తే.. అప్పుడు ఉపాసనతో తనకు ఉన్న ప్రేమ వ్యవహారాన్ని తండ్రితో చెప్పాడట రామ్ చరణ్. దీంతో ఇక చిరంజీవి ఈ విషయాన్ని వెంకటేష్కు చేరవేశారు. ఇలా తర్వాత కాలంలో అందరి సమక్షంలో ఉపాసన రామ్ చరణ్ పెళ్లి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: