టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో హీరో రవితేజ కూడా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి

ఇప్పుడు మరో హీరో పేరు వినిపిస్తోంది. హీరో మంచు మనోజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మంచు మనోజ్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఇంటర్వెల్ కి ఫుల్ ఎమోషనల్ గా సినిమా టర్న్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుందని.. ఇది ఒక విలన్ పాత్ర అని తెలుస్తోంది.

దీనిపై త్వరలోనే అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి నిజంగానే మంచు మనోజ్, బాలయ్య సినిమాలో నటిస్తే.. నందమూరి అభిమానులకు ఫుల్ పండగే. అసలుకే.. మంచు మనోజ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రేజ్ కూడా బాలయ్య సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య సినిమా గురించి మాట్లాడుతూ.. 'బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

పైగా బాలయ్యతో పాటు మరో హీరో మంచు మనోజ్ కూడా సినిమాలో ఉంటాడు. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఆ అంచనాలకు తగ్గకుండానే సినిమాని ప్లాన్ చేస్తాం అని అనిల్ రావిపూడి ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. ఇక నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.

 
మరి అనిల్ రావిపూడి - బాలయ్య బాబు - మంచు మనోజ్ లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే… ఆ కిక్కే వేరు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మరోపక్క 'అఖండ'తో బాక్సాఫీస్ దగ్గర 'నటసింహం' కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండమైన విజయాలు సాధించిన ఈ ఇద్దరు ఓకే సినిమా కోసం పని చేయడం విశేషం.

అందుకే, ఈ సినిమా భారీ విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదే. అయితే, ఈ సినిమా ఇటు మంచు మనోజ్ కి కూడా బాగా ప్లస్ కానుంది. సోలో హీరోగా సినిమాలు చేయడం మానేసిన మనోజ్ కి ఈ సినిమా మంచి బూస్టప్ కానుంది. అన్నట్టు బాలయ్య - మనోజ్ గతంలో ఊ..కొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాలో కలిసి నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: