తమిళ సినిమా ఇండస్ట్రీ లో హీరోగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ధనుష్ తాజాగా నానే వ‌రువేన్ అనే మూవీ లో హీరోగా నటించాడు. క‌లైపులి ఎస్‌థాను ఈ మూవీ ని నిర్మించారు. సెల్వ రాఘవన్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని 'నేనే వస్తున్నా' అనే పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని క‌లైపులి థానుతో కలిసి అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా , అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీ ని తమిళ మరియు తెలుగు భాషల్లో సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ నేనే వస్తున్నా మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా నేనే వస్తున్నా మూవీ యూనిట్ ఈ మూవీ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ధనుష్ తాజాగా తిరు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు 100 కోట్ల కు  పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. మరి తిరు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ధనుష్ 'నేనే వస్తున్నా' మూవీ తో  ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: