మంచు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హీరో మంచు మనోజ్  ఒకరు. దొంగ దొంగది అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలు చేశాడు కానీ ఎందుకో స్టార్ హీరో మాత్రం కాలేకపోయాడు.  అయితే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటూ తన పని ఏంటో అది చేసుకుంటూ పోతూ ఉంటాడు మంచు మనోజ్. అయితే ఇటీవలే మంచు మనోజ్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అతను సినిమాల్లో నటించక దాదాపు నాలుగేళ్లు గడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సినిమా కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో నిరీక్షణగా ఎదురుచూస్తున్నారు.  సినిమా విషయం పక్కన పెడితే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక ను మంచు మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.


 అదే సమయంలో మంచు మనోజ్ నుంచి విడాకులు తీసుకుని వేరుపడిన  మొదటి భార్య ప్రణీత రెడ్డి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మంచు మనోజ్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత ప్రణీత రెడ్డి అమెరికాకు వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. అక్కడ ఈమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్టుగా తన పనిలో బిజీగా ఉందట.  సింగల్ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ ప్రణీత రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. కథ వివాహమైన కొంతకాలానికి వీరు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అన్న వార్తలు వినిపించాయి.. తర్వాత వీరు విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. చివరికి ఈ వార్తలు నిజమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: