కరోనా వైరస్ అనంతరం సినిమా పరిశ్రమ మెల్ల మెల్లగా అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డైరెక్టర్స్ తమకు ఇష్టం వచ్చిన కథలను సినిమాలు తీస్తే ఒప్పుకునే పరిస్థితిలో సినిమా పరిశ్రమను బ్రతికిస్తున్న ప్రేక్షకులు లేరు. అయితే బాలీవుడ్ లో కరోనా తర్వాత హిట్ సాధించిన సినిమాలు లేవనే చెప్పాలి. కానీ పురుగు పరిశ్రమ అయిన టాలీవుడ్ మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్ ను తీసి, హిందీలోనూ రిలీజ్ చేస్తూ అద్బుతమయిన కలెక్టన్ లను సాధించింది. అందుకే బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ కల నెరవేరుతుందా అంటూ సినీ పెద్దలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినిమా ఆ కళను నెరవేరుస్తుంది అని అనుకున్నారు.

సినిమా గత వారమే ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఇందులో రన్బీర్ కపూర్ మరియు అలియా భట్ లు ప్రధాన పాత్రలు పోషించగా, మరికొన్ని ముఖ్య పాత్రలలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ లు నటించారు. ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ లను చూసిన ప్రేక్షకులు అంచనాలను భారీగా పెట్టుకున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమా మొత్తం కూడా గ్రాఫిక్స్ తో కూడుకున్నదే... అదే ప్రాణం. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ విషయంలో తగిన శ్రద్ద పెట్టలేదని క్లియర్ గా అర్ధమవుతోంది.

కాగా ట్రేడ్ వర్గాల ప్రకారం బ్రహ్మాస్త్ర ఇప్పటి వరకు రూ. 267.29 కోట్లను కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఉంది. ఇప్పటికే కలెక్షన్ లు తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 410 కోట్లతో నిర్మించిన బ్రహ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 143 కోట్లు సాధించాల్సి ఉంది. ఒకవేళ ఇది కనుక జరగకపోతే మళ్ళీ బాలీవుడ్ లో పాత కథే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: