కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . గౌతమ్ వాసుదేవ్ మీనన్ కేవలం మూవీ లకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ,  కొన్ని సినిమా లలో నటించి కూడా ప్రేక్షకులను అలరించాడు . కొంత కాలం క్రితం విడుదల అయిన తెలుగు సినిమా సీతా రామం లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు .

ఇది ఇలా ఉంటే తాజా గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'తాంధు వెనిందాతు కాదు' అనే మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో శింబు హీరోగా నటించాడు . ఈ మూవీ తమిళ్ లో ఈ రోజు అనగా సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల అయ్యింది .  ఈ మూవీ తెలుగు లో సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతోంది . ఇది ఇలా ఉంటే తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'తాంధు వెనిందాతు కాదు' మూవీ విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ...  రామ్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై తేరక్కపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పేక్షకులను మెప్పించ లేక పోయింది. మరి కొన్ని రోజుల్లో రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించ బోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: