కొన్ని క్లాసిక్ హిట్ సినిమాల టైటిల్స్ ను పెట్టి సినిమాలు చేయడం ఎంతో రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే సదరు సినిమా ల పై ఆ క్లాస్ సినిమా యొక్క ప్రభావం చాలా ఉంటుంది ప్రేక్షకుల మీద. కాబట్టి ఆ సినిమాల టైటిల్స్ ను బాగా ఉంటే తప్ప వాడకూడదు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో భారీ విజయాన్ని సాధించిన స్వాతిముత్యం సినిమా యొక్క టైటిల్ ను ఇప్పుడు ఓ యువ హీరో తన సినిమా కోసం వాడడం అందరిలో ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. కమల్ హాసన్ లాంటి అగ్ర హీరో నటించిన సినిమా యొక్క టైటిల్ వాడుతున్నారు అంటే ఆ సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉండాలి.

కానీ ఓ డెబ్యూ హీరో సినిమా కోసం ఈ టైటిల్ను వాడడం అందరిని ఆశ్చర్యపరిచిన విషయం అనే చెప్పాలి. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం స్వాతిముత్యం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ వర్షా బొల్లమ్మ ఈ చిత్రంలో కథనాయకగా నటిస్తూ ఉండగా ప్రస్తుతం ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్ర బృందం.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా లో మంచి కంటెంట్ ఉన్నట్లుగా గా ట్రైలర్ తెలియపరుస్తుంది. తప్పకుండా ఈ హీరోకి తొలి విజయం తొలి సినిమాతోనే వస్తుంది అని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరించాలని బెల్లంకొండ అభిమానులు కోరుకుంటున్నారు. 
హిట్టు కోసం దానికి రెడీ

మరింత సమాచారం తెలుసుకోండి: