తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులలో కొన్ని కొన్ని సార్లు ఎంతో పట్టుదల నెలకొంటూ ఉంటూ ఉంటుంది ఒక హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోతే వారు ఆ హీరో తమతో సినిమా చేసేదాకా ఏ మాత్రం వదిలిపెట్టరు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక హీరో కోసం ఎదురుచూస్తూ చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఓ ఇద్దరు దర్శకులు. మంచి ట్రాక్ రికార్డు ఉన్నా కూడా వారు ఈ విధంగా చేయడం పట్ల దీనిలో వారికి ఎక్కువగా తమ మూర్ఖత్వమే కనిపిస్తుంది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం దాదాపుగా రెండేళ్ల సమయాన్ని వృధా చేశాడు హరీష్ శంకర్.  ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చిన కూడా ఇంకా ఆ సినిమాను మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని ప్రకటించి చాలా రోజులు అయిపోయింది ప్రకటించినప్పుడే ఈ సినిమాను ప్రారంభించి ఉంటే ఈపాటికి రిలీజ్ కూడా అయి ఉండేది ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ లో మరొక సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.

 మరి ఇప్పటికి కూడా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్న క్లారిటీ లేకపోవడంతో హరీష్ మరొకసారి ఈ సినిమా గురించి ఆలోచించి ముందడుగు వేస్తే మంచిదని కోరుకుంటున్నారు ఇక తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఎన్టీఆర్ కోసం ఎన్ని రోజులు వేచి చూస్తాడో తెలియడం లేదు ఆ సినిమా విడుదలయ్యి సంవత్సరం దాటినా కూడా తన తదుపరి సినిమాను ఇంకా మొదలు పెట్టలేకపోతున్నాడు. పోనీ ఎన్టీఆర్ తో సినిమాను వెంటనే మొదలుపెడతాడా అంటే ఎన్టీఆర్ చేతిలో ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యే దాకా బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా చేయడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: