విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా యొక్క తాజా షెడ్యూల్ త్వరలోనే మొదలుకాపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత కథానాయక నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త పాత్రలో నటిస్తూ ఉండగా గీత గోవిందం లాంటి మంచి క్లీన్ సినిమాగా ఇది ఉండిపోతుంది అని చిత్ర బృందం భావిస్తుంది. ప్రేమ కథ సినిమాలను ఎంతో బాగా రూపొందించే దర్శకుడైన శివ నిర్మాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఇటీవల కాశ్మీర్ లో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ పూర్తి కాగా తాజాగా మరొక భారీ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తుంది. వైజాగ్ లో ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలో మొదలు పెట్టుకోబోతుంది. ఆ తర్వాత కేరళలో కూడా ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది అని అంటున్నారు. 

ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడంతో ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని చెప్పి విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని ఎంతో స్పెషల్ కేర్ తీసుకొని మరి చేస్తున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సౌత్ లో అన్ని భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలనే డిమాండ్ ఇప్పుడు పెరుగుతుందట. లైగర్ సినిమా ద్వారా ఆయనకు వచ్చిన క్రేజ్ తో ఈ సినిమాను విడుదల చేసి మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. మరి ఎన్నో రోజులుగా ఆయన కోరుకుంటున్నా విజయం ఈ సినిమాతో దక్కుతుందా అనేది చూడాలి. త్వరలోనే అయన హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమా కు నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

VD