డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా విశ్వక్సేన్ నటించారు. ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో విశ్వక్సేన్ తనదైన నటనతో ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని హిట్ -2 గా తెరకెక్కించడం జరుగుతోంది.. ఈ చిత్రంలో హీరో అడవి శేషు నటిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రాన్ని హీరో నాని సమర్పిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ సినిమా పైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు.


సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గత సంవత్సరం ఈ సినిమా షూటింగ్ మొదలు కాగ .. అనివార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా తేదీ పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ ఎట్టకేలకు విచిత్రాన్ని విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడం జరిగింది. నాని స్వయంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. రిలీజ్ డేట్ పోస్టర్ను కూడా ట్విట్ చేస్తూ డిసెంబర్ రెండవ తేదీన సెకండ్ కేస్ రాబోతోంది అని తెలియజేశారు.

దీంతో ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఇప్పుడు పోస్ట్ పడిందని చెప్పవచ్చు.. ఈ సినిమాలో అడవి శేషుకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నది. ఇక ఈ సినిమాలో రాహు రమేష్, భానుచందర్, తనికెళ్ల భరణి పోసాని కృష్ణ మురళి తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం అడవి చేసి వరుస విజయాలతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: