టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు ఆదివారం మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆదివారం మరణించడంతో మంగళవారం ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఈయన సంతాప సభ ఏర్పాటు చేశారట.


ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ ప్రముకులు కూడా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కృష్ణంరాజు గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిర్మాతగా కృష్ణంరాజు గారితోనే మొట్టమొదటి సినిమా చేశానని ఆయన తెలిపారు.


అయితే ఈ సినిమాకు మా అన్నయ్య దర్శకుడిగా పని చేశారు. ఇక ఈ సినిమాలో తన అన్నయ్య నాలుగు పాటలు పెడదామని చెప్పగా కృష్ణంరాజు గారు సినిమాలో నాలుగు పాటలు పెడితే ఎవడు చూస్తారని ఇదే విషయాన్ని వెళ్లి కృష్ణంరాజు గారికి చెప్పాను. ఈ మాటలు విన్న ఆయన స్థానంలో మరో హీరో ఎవరైనా ఉంటే లాగి పెట్టి నన్ని కొట్టేవాళ్ళు. నేను ఇలా మాట్లాడిన కృష్ణంరాజు గారు ఓ చిన్న నవ్వు నవ్వి నేను పనికిరానా అంటూ తన అన్నయ్యను ఒప్పించి పాటలు కూడా లేకుండా చేశారు.


 


అయితేఈ సంఘటన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు పాటు కృష్ణంరాజు గారి ఫోన్ తీయాలన్నా కూడా నాకు భయం వేసేదని ఈయన వెల్లడించారు. కృష్ణం రాజు గారు సినిమాకు ఏం చేయాలో ఎంత కావాలో అది మాత్రమే చేస్తారని సినిమాపై తనకున్న ఫ్యాషన్ ఏంటో ఈయన వెల్లడించారట.ఇకపోతే గత మూడు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు గారు తన వద్దకు వచ్చి మూవీ టవర్స్ లోతనకొక ఫ్లాట్ కావాలని అడిగారు అయితే మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంతే ఇవ్వాలని చెప్పగా అందుకు కృష్ణంరాజు గారు ఓకే చెప్పారట.


 


అయితే చివరికి ఆయన కోరిన ఆ ఒక్క కోరికను నేను తీర్చలేకపోయానని ఆయనకు ఫ్లాట్ ఇవ్వలేకపోయాను అని కూడా తెలిపారు. ఇలా ఆయన కోరికను కూడా తీర్చుకోలేకపోయానని తాను ఎంతో సిగ్గుపడుతున్నానంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి కృష్ణంరాజు గారితో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: