బిగ్ బాస్' ఫేమ్ అషు రెడ్డి ఓ కారుకి ఓనర్ అయ్యింది.ఈ కారు ఆమెకు బహుమతిగా లభించిందని సమాచారం.ఆమెకు కారు కొనిచ్చింది మరెవరో కాదు ట ఆమె తండ్రి.


ఈరోజు అనగా సెప్టెంబర్ 15న ఆమె పుట్టినరోజు కావడంతో అషు రెడ్డికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు ట ఆమె తండ్రి.ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో తెలియజేసింది. 'ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ప్రైజ్ బహుమతి ఇదే.. ' అంటూ కూడా ఆమె పేర్కొన్నారు.


అలాగే కారుతోనూ అలాగే తన తండ్రితోనూ దిగిన ఫోటోలను కూడా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి.. అంతకు ముందు నితిన్ నటించిన 'ఛల్ మోహన్ రంగ' చిత్రంలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అయితే గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కారణంగా డిప్రెషన్ కు గురవ్వడం.. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల బరువు పెరిగినట్టు ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చింది.


 


'బిగ్ బాస్ 3' లో ఈమె ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ సీజన్లో కొన్నాళ్ల పాటు ఈమె హౌస్ లో అయితే కొనసాగింది.అటు తర్వాత ఈమె బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కూడా ఆమె పాల్గొంది. ప్రస్తుతం బుల్లితెర షోలతోనూ అలాగే తన యూట్యూబ్ ఛానల్ లో పర్సనల్ వీడియోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. ఇక ఆమె కొత్త కారు ఫోటోలను మీరు కూడా ఓ సారీ లుక్కేయండి : తన నాన్న తో ఆ కారులో ట్రిప్ కూడా వెళ్లిందని సమాచారం. తనకి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు తన నాన్న కు మనసారా థాంక్స్ చెప్పిందట..





మరింత సమాచారం తెలుసుకోండి: