హీరోయిన్ అంటే సన్నగా కాకర తీగ లాగా ఉంటేనే అవకాశాలు వస్తాయి అనే ట్రెండ్ ఉంది.. ఏ మాత్రం శరీరంలో మార్పులు వచ్చినా ఇక అవకాశాలు అస్సలు రావు అనే దానికి చరమగీతం పాడి బొద్దుగా ఉన్న ముద్దుగా అలరిస్తున్నామని చెబుతూ ఇండస్ట్రీలో బొద్దుగా ఉండి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హీరోయిన్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..హీరోయిన్స్ అంటే కేవలం జీరో సైజ్ అని కాదు అలాగని ఏ రూల్ కూడా పెట్టలేదు.


బొద్దుగా కనిపిస్తూనే స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు ఈ కథానాయికలు.. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది మనం నిత్యామీనన్.


ఈమె ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి బొద్దుగానే ఉన్నారు. తాజాగా విడుదలైన ధనుష్ తిరు సినిమాలో కూడా బొద్దుగానే కనిపించారు. దీనిపై భారీ ట్రోలింగ్ కూడా జరిగింది. అలాగే నివేదా థామస్ కూడా ఈ మధ్యకాలంలో చాలా వెయిట్ పెరిగారు. ఈ మధ్యకాలంలో ఆమె ఒక డాన్స్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందట.. అయిన ఆమె తగ్గేది లేదంటూ బొద్దుగానే ఉంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అలాగే హీరోయిన్ అంజలి సైతం ముందు నుంచి బొద్దుగానే ఉన్నారు. అయినా ఆమె టాలెంటుతో మాయ చేస్తూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆ మధ్య కాలంలో కాస్త బరువు తగ్గినా మళ్లీ ఇప్పుడు ఆమె వెయిట్ పెరిగింది.


కెరియర్ మొదట్లో చాలా సన్నగా కనిపించిన అనుష్క శెట్టి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా బరువు పెరుగుతూ వచ్చారు. మధ్యలో బిల్లా సినిమాలో అదిరిపోయే బాడీ షేప్ తో కనిపించిన ఈ అమ్మడు, ఆ తర్వాత సైజ్ జీరో సినిమా కోసం చాలా బరువు పెరిగారు అనుష్క. నయనతార కూడా ముందు నుంచి సన్నగా ఉండటానికి అయితే పెద్దగా ఇష్టపడలేదు. ఎప్పుడైనా బొద్దుగానే ఉండేవారు. ప్రస్తుతం స్లిమ్ గా కనిపిస్తోంది. మోడ్రన్ మహానటి కీర్తి సురేష్ కూడా ఒక్కోసారి సన్నగా ఒక్కోసారి బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా హీరోయిన్లు ట్రెండ్ కు తగ్గట్టు గా ఓసారి సన్నగా ఓసారి బొద్దుగా అవుతూ విజయవంతంగా ఆమె దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: