సినిమా విజయం ఇచ్చే కిక్‌ కంటే.. తెచ్చి పెట్టే భారమే ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. అంటే.. అది బరువుగా ఉండే భారం అయితే కాదు. మరిన్ని విజయాలు సాధించాలనే భారం అన్నమాట


ఇప్పుడు ఇలాంటి భారమే అనుభవిస్తున్నాడు నిఖిల్‌. 'కార్తికేయ 2' సినిమాతో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్‌. దీంతో నిఖిల్‌ నుండి రాబోయే రెండు సినిమాలపై భారీ అంచనాలు అయితే ఏర్పడతాయి. దీంతో ఆ సినిమాల సంగతిని మరోసారి నిఖిల్‌ చెక్‌ చేసుకుంటున్నాడట.


నిఖిల్‌ నుండి త్వరలో రాబోయే సినిమాలు అంటే '18 పేజీస్‌', 'స్పై'. వీటిలో తొలి సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయిపోయిందట . తర్వాత ప్రచారం కూడా స్టార్ట్‌ చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఆపేశారు. ఈ లోపు కరోనా పరిస్థితులు రావడంతో.. సినిమా విడుదల ఆగిపోయింది. ఇక 'స్పై' సినిమా అయితే పూర్తి కావాల్సి ఉంది. దీంతో వీలైనంత త్వరగా '18 పేజీస్‌' సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారని అంతా అనుకున్నారట.. కానీ ఇప్పుడు చూస్తే సినిమాకు రిపేర్లు జరుగుతున్నాయని సమాచారం.


 


అవును '18 పేజెస్‌' సినిమా రీషూట్లకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. సుకుమార్ రచనలో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులను కూడా దర్శకుడు సూర్యప్రతాప్‌ గురువు సుకుమార్‌ సూచించారట. త్వరలో వాటిని పూర్తి చేసి సినిమాను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. ఆ తర్వాతే సినిమా ప్రచారం షురూ చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పుడు చేస్తున్న మార్పులు మైనరా? మేజరా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది.


 


మరోవైపు 'స్పై' సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం అయితే తీసుకున్నారట. ఎందుకంటే ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను తొలుత దసరాకు రిలీజ్‌ చేద్దాం అనుకున్నారట  కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: