తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా, నివేద థామస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన షాకిని- డాకినీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా సురేష్ బాబు, సునీత తాటి ఉండడం జరిగింది. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు హీరోయిన్లు సక్సెస్ అయ్యారా లేదా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సినిమా కథ విషయానికి వస్తే ఇందులో రెజీనా,నివేద థామస్ ..షాకిని- డాకినీ పాత్రలో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడమీలోకి వెళ్తారు.. ఆ తర్వాత ఊహించని విధంగా ఒక గ్యాంగ్ తో తలపడవలసి వస్తుంది.. దీంతో వీరు మానవ రవాణా ముఠా నుండి ఎలా బయటపడతారు అనే కథని ఈ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఇక ఈ చిత్రంలో నివేద థామస్, రెజీనా తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇద్దరూ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించారు.


ఈ సినిమాని వీరిద్దరి ముందుకు తీసుకువెళ్లారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులోని యాక్షన్స్ సన్నివేశాలు కూడా అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ గా మారింది.. ఇక అంతే కాకుండా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మార్చి ఉంటే మరింత బాగుండేదని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మొత్తానికి డైరెక్టర్ సుధీర్ వర్మ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది మరి కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: