సాయికుమార్ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు కాని ఏ సినిమాలోను అతడు కోరుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నాడు. స్వయంగా సాయికుమార్ తన కొడుకుని హీరోగా సెటిల్ చేయాలని తనకు ఉన్న పరిచయాలు అన్నీ ఉపయోగిస్తున్నా ఏప్రయత్నం ఆది సాయికుమార్ విషయంలో కలిసి రావడంలేదు.


ఈమధ్య కాలంలో సినిమా టైటిల్స్ విషయంలో వివాదాలు రావడం తరుచు జరుగుతోంది. ఒక టైటిల్ తమదంటే తమది అంటూ నిర్మాతలు దర్శకులు ఫిలిం ఛాంబర్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న సంఘటనలు అనేకం వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వివాదంలో మళయాళ టాప్ స్టార్ ఫహద్ ఫాజిల్ ఆది సాయికుమార్ లు చిక్కుకోవడం సంచలనంగా మారింది.  తమిళంతో పాటు తెలుగులో అనేక సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న ఫహద్ ఫాజిల్ అల్లు అర్జున్ తో కలిసి `పుష్ప` లో నటించిన తరువాత అతడి మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది.


ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ ఫాజిల్ ఒక మళయాళ మూవీలో నటిస్తున్నాడు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై సుధీర్ శంకర్ తీసిన ఈ మూవీకి రీసెంట్ గా ‘టాప్ గేర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడ  విడుదల చేశారు.  అయితే ఈ టైటిల్ చుట్టూ ఇప్పుడు వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  



ఆది సాయికుమార్ హీరోగా శశికాంత్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ ఒక మూవీని తీస్తున్నాడు. ఈమూవీకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఈమూవీకి కూడ ‘టాప్ గేర్’ అన్న టైటిల్ ను పెట్టారు. తమ టైటిల్ ను మళయాళ సినిమా నిర్మాతలు కాపీ కొట్టారు అంటూ ఇప్పుడు ఒక వివాదం మొదలైంది. దీనితో ఈవివాదం ఎలా పరిష్కారం అవ్వబోతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: