మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కి సంబంధించిన మొదటి పాట నిన్న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్య కారణంగా పాటను విడుదల చేయలేకపోతున్నామంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించి విడుదల వాయిదా వేయడం జరిగిందట.


సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు అస్సలు చేయడం లేదంటూ మెగా అభిమానులు అయితే ఇప్పటికే తీవ్ర సంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో పాట విడుదల చేస్తున్నాం అంటూ ఊరించి చివరి నిమిషంలో టెక్నికల్ సమస్య అంటూ చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మెగా ఫ్యాన్స్ నిర్మాతలను ప్రశ్నిస్తున్నారట.


చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ లు డాన్స్ చేసిన ఆ పాటని చూసేందుకు తెలుగుతో పాటు ప్రతి ఒక్క భాష ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ఆచార్య తీవ్రంగా నిరాశపర్చింది. అయినా కూడా ఈ సినిమా పై నమ్మకంతో మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న పని కారణంగా సినిమాపై ఆసక్తి తగ్గుతుంది అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.


ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు కనీసం పాట విడుదల చేస్తున్నారంటే.. పాట ని కూడా వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. కేవలం పాటను మాత్రమే వాయిదా వేస్తారా సినిమాని కూడా వాయిదా వేసి బిస్కెట్ చేస్తారా అంటూ కొందరు అభిమానులు అసహనంతో వ్యాఖ్యలు చేస్తున్నారట..


సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్‌ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా లో కీలక పాత్రలో నయన తార, పూరి జగన్నాథ్, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్ ఇంకా తదితరులు నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖు న ఈ సినిమా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: