టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి తాజాగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత శ్రీధర్ గాడే దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్ ఆర్ కల్యాణ మండపం మూవీ తో కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందు కోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తనసికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర చుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావలసిన వాడిని' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసు కుందాం.

నైజాం :  160 .
సడెడ్ :  85 .
ఆంధ్ర :  220 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ : 465 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతోంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  60 ప్లస్ .
ఓవర్ సిస్ లో : 160 .
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నేను మీకు బాగా కావాల్సిన మూవీ 685 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: