తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి పరిచయం అయితే అవసరం లేదు.


ఈయన వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ తన తదుపరిచిత్రం ఖుషి సినిమాపై పెట్టుకున్నారట.. ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేస్తుంది.


శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇటు విజయ్ దేవరకొండ అలాగే దర్శకుడు శివ నిర్వాణ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారట..అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ కేవలం సమంత కారణంగానే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.సమంత ఇప్పటికే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడాఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు, టాక్ షో లతో బిజీగా ఉన్నారు.


ఇలా ఈమె పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా డేట్స్ క్లాష్ అవుతూ ఉండడంతో సినిమా తరచు వాయిదా పడుతూ వస్తోంది.ఇప్పటికే ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా సమంత డేట్స్ లేని కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుందని ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ సమంత పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ఈ విధంగా సమంత వల్లే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ఆలస్యమవుతుందని చెప్పవచ్చు.లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో హిట్టు కోసం ఎదురుచూస్తున్నటువంటి విజయ్ దేవరకొండకు ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో పెద్ద సమస్యగా మారుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: