ప్రస్తుతం చాలా మంది ప్రతిభ ఉన్నవారు స్టార్స్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫారం గా మారింది .  ఏ రంగంలో అయినా సరే ప్రతిభ వుండి..కొంచెం కొత్తగా చూసేవారికి కనువింపు కలిగితే, క్రేజ్, ఫాలోయింగ్ సపోర్టు తానంతటవే వచ్చేస్తాయి.అయితే  ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజెన్స్ మెప్పు పొందగలిగితే ఇక ఎవరైనా సరే సెలబ్రిటీలే.. ఎందుకంటే ఇక  సోషల్ మీడియా లేని సమయంలో కష్టాలు పడి కనుమరుగైపోవడం వేరు అలా ఎందరో ఏవేవో రంగాలలో టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్రమంలో తగిన గుర్తింపు లభించక ఆయా రంగాలను వదిలిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాను సరిగ్గా యూస్ చేసుకోగలిగితే కచ్చితంగా సెలబ్రిటీషన్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది.అయితే ఇలాంటి వారిలో గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరు .ఇదిలావుంటే  ఒకవైపు కండక్టర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు డాన్సర్ గా ప్రయత్నాలకు, హార్డ్ వర్క్ కి దాదాపు 11 సంవత్సరాల తర్వాత గుర్తింపు లభించింది.  ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది ఝాన్సీ.ఇక  ఈ షోలో చేసిన పల్సర్ బైక్ పెర్ఫార్మెన్స్ ఒక్కసారిగా ఝాన్సీ ని స్టార్ ను చేసేసింది. అప్పటినుండి ఎక్కడ చూసినా ఝాన్సీ పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

అయితే  ఈ క్రమంలోనే పెళ్లికి ముందే డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఝాన్సీ కి పెళ్లి జరిగిపోయి కండక్టర్గా స్థిరపడిన పదేళ్లకు గుర్తింపు ఆలస్యంగా లభించడం జరిగింది.ఇంటర్ పూర్తయిన వెంటనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఝాన్సీ కి ఆమె చేసే ప్రతి పనిలో కూడా తన భర్త అండగా వస్తున్నాడు..  ఈ నేపథ్యంలోనే తన భర్త గురువు రమేష్ మాస్టర్ సహాయంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఝాన్సీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈమె  మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె గురించి విన్న సంపూర్ణేష్ బాబు ఆమెకు ఫోన్ చేసి సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు.అయితే  ఇక్కడ ఝాన్సీ టాలెంట్ తో పాటు సంపూర్ణేష్ బాబు మంచి మనస్సు కూడా జనాలకు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: