గత కొంత కాలంగా వరస పరాజయాలతో టీలా పడిపోయి ఉన్న శర్వానంద్ తాజాగా శ్రీ కార్తిక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రీతు వర్మ ,  శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

అక్కినేని అమలమూవీ లో మరో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన తెలుగు తో పాటు తమిళ భాషలో విడుదల అయ్యింది.  ఈ మూవీ ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 7  రోజుల్లో ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 2.48 కోట్లు .
సీడెడ్ : 39 లక్షలు .
యు ఏ : 55 లక్షలు .
ఈస్ట్ : 37 లక్షలు .
వెస్ట్ : 25 లక్షలు .
గుంటూర్ : 35 లక్షలు .
కృష్ణ : 32 లక్షలు .
నెల్లూర్ : 20 లక్షలు .
7  రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక జీవితం మూవీ  4.91 కోట్ల షేర్ , 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  40 లక్షలు .
తమిళ నాడు లో :  90 లక్షలు .
ఓవర్ సిస్ లో :  1.43 కోట్లు .
7 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ 7.64 కోట్ల షేర్ , 17.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: