ఇప్పటికే ఎంతో మంది తెలుగు హీరో లు తమిళ దర్శకుల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లలో నటించి మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఎంతో మంది టాలీవుడ్ హీరో లు తమిళ దర్శకుల మూవీ లలో నటిస్తూ వస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే రామ్ పోతినేని తమిళ క్రేజీ దర్శకుడు అయి నటు వంటి లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు  . 

మంచి అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయిన ది వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది . ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆది పినిశెట్టిమూవీ లో ప్రతి నాయకుడి పాత్ర లో నటించాడు . ఇలా ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు దర్శకత్వం లో తెరకెక్కిన ఒక మూవీ లో హీరో గా నటించిన రామ్ పోతినేని మరో తమిళ దర్శకుడి సినిమాలో నటించ బోతున్నాడు .  

తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో రామ్ పోతినేని మరి కొన్ని రోజులో  నటించ బోతున్నాడు . ఈ విషయాన్ని తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధ్రువీకరించాడు . ఇలా రామ్ పోతినేని తమిళ దర్శకుల సినిమాలలో నటించడానికి కాస్త ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలుగు లో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: