ఉప్పెన తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి(Krithi Shetty ). తొలి సినిమా తోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ వయ్యారిభామ


టాలీవుడ్ లో టాప్ గేర్ తో దూసుకుపోతోంది. ఉప్పెన సూపర్ హిట్ తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ లో నటించి మెప్పించింది. ఈ కూడా మంచి హిట్ ను అందుకుంది. ఆ వెంటనే నాగార్జున, నాగచైతన్య కాంబోలో వచ్చిన బంగార్రాజు కూడా మంచి హిట్ అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి లక్కీ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమా లు నిరాశపరిచాయి. అయినా కూడా ఈ చిన్నదానికి ఆఫర్లు అయితే ఆగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ లతో బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్ సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది.


సినిమాలతో నే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కృతి. తన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి అడగగా.. కృతి స్పందిస్తూ..”రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్ స్టార్’ అంటూ చెప్పుకొచ్చిందట.. ఈ ఒక్క మాట తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నా రు. ఇక కృతి ల విషయానికొస్తే తాజాగా ఈ అమ్మడు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే తమిళ్‌లో స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమా లో ఛాన్స్ దక్కించుకుంది కృతి.

మరింత సమాచారం తెలుసుకోండి: