టాలీవుడ్ యంగ్ హీరోస్ నిఖిల్ ఇంకా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 18 పేజెస్. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యి చాలా కాలం అవుతుంది. కాని దానికి ముహూర్తమే కుదరడం లేదు. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా కాలంగా సైలెంట్ గానే ఉంది.అంతే కాదు ఈ మధ్య కాలంలో 18 పేజెస్ నుంచి ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్. ఈలోపు నిఖిల్ నటించి కార్తికేయ2 సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమా రిలీజ్ పై కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కరోనా ఇబ్బందులు పోయాయి.. సినిమా షైటింగ్ కూడా పూర్తయ్యింది. కాని ఎందుకు ఈమూవీ రిలీజ్ అవ్వడంలేదో తెలియక చాలా మంది ఆలోచనలో పడ్డారు. అంతే కాదు ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది.ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


అందుకే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈసినిమాలో భాగస్వామిగా ఉన్న సుకుమార్ ఈ సినిమాను రీసెంట్ గానే చూశారట. కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన అంతగా సంతృప్తి చెందకపోవడంతో, ఆ సీన్స్ ను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సమాచారం. నిఖిల్ కూడా ఆ సీన్స్ మళ్లీ చేయడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. ఇక ఈ సినిమా నిజంగానే రీ షూట్ కు వెళ్తే.. ఎప్పటికి రిలీజ్ అవుతుందో చూడాలి.రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నిఖిల్. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ సత్తా చాటాడు. ఆయన కెరీర్ లో 120 కోట్ల మార్క్ టచ్ చేయడం కూడా ఇదే మొదటి సారి. తెలుగు ఆడియన్స్ తో పాటు. హిందీ ఆడియన్స్ ను కూడా అలరించడంతో.. నిఖిల్ కు బాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి మూడు నాలుగు ఆఫర్లు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే టైమ్ లో 18 పేజెస్ సినిమా  సూపర్ హిట్ అయితే నిఖిల్ కు పాన్ ఇండియా హీరోగా ఫిక్స్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: