‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీ తరువాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నాగార్జునకు చెప్పుకోతగ్గ హిట్ లేదు. చిన్న హీరోల సినిమాలు కూడ 100 కోట్ల కలక్షన్ మార్క్ ను అందుకుంటూ ఉంటే నాగ్ మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా 100 కోట్ల హీరోగా మారలేకపోతున్నాడు. బుల్లితెరపై ప్రసారం అయ్యే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లేకపోతే నాగార్జునను ఈతరం ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయేవారు అన్న కామెంట్స్ కొందరు చేస్తూ ఉంటారు.


నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి 4 దశాబ్దాలు అవుతోంది. అతడు నటించే 100వ సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే సంవత్సరం నాగార్జున తన 100వ సినిమా మొదలుపెట్టాలి అన్న స్థిర నిర్ణయంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన 100వ సినిమా గురించి నాగార్జున అనేకమంది దర్శకులతో ఆలోచనలు చేస్తున్నప్పటికీ నాగ్ మనసులో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు అని అంటున్నారు.


అతడికి కుదరకపోతే ఎవరైనా ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ నాగ్ మనసులో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో దసరా రేస్ కు రాబోతున్న ‘ది ఘోస్ట్’ మూవీ పై నాగార్జున చాల ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ మూవీని చాల డిఫరెంట్ గా తీయడంతో నాగార్జున చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తో పోటీ పడుతున్నాడు.


ఈ మూవీని నాగార్జున అంచనాల ప్రకారం సూపర్ హిట్ అయితే తన 100వ సినిమా గురించీ ఇప్పటి నుండే ఆలోచనలు చేయాలని నాగ్ ఉబలాట పడుతున్నట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీ 200 కోట్ల కలక్షన్ మార్క్ ను దాటడంతో నాగ్ మంచి జోష్ లో ఉన్నాడు. ఆమూవీలో నాగార్జున కనిపించింది కేవలం 20 నిమిషాలే అయినప్పటికీ నాగార్జున నటనకు బాలీవుడ్ మీడియాలో ప్రశంసలు లబిస్తు ఉండటంతో నాగ్ మంచి జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది..





మరింత సమాచారం తెలుసుకోండి: