చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్ బష్టర్ హిట్స్ తో పాటు మరెన్నో సూపర్ ఫ్లాప్ లు కూడ ఉన్నాయి. అయితే ‘ఆచార్య’ ఫ్లాప్ చిరంజీవికి ఇచ్చినంత షాక్ మరే మూవీ ఇవ్వలేకపోయిందా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనికి కారణం మరో 20 రోజులలో విడుదల కాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీకి ఏమాత్రం క్రేజ్ లేకపోవడం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


వాస్తవానికి చిరంజీవి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది అంటే ఆ మూవీ పై విపరీతమైన ఆశక్తి పెరిగి సోషల్ మీడియాలో అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి హడావిడి ఏమాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీనితో ‘గాడ్ ఫాదర్’ బయ్యర్లు ఈ మూవీని భారీ రేట్లకు కొనే విషయంలో వెనకడుగు వేయడంతో ఈ మూవీ బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


దీనితో ఈ మూవీని అడ్వాన్స్ ల విధానంలో విడుదల చేసి బయ్యర్లలో ఎటువంటి టెన్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి చిరంజీవి సినిమా అంటే బయ్యర్లు ఎంత డబ్బు పెట్టడానికి అయినా వెనకాడే పరిస్థితి గతంలో ఉండేది కాదు. అయితే చిరంజీవి నటించిన ‘సైరా’ ఒక మోస్తరిగా ఆడటం ఆతరువాత వచ్చిన ‘ఆచార్య’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో చిరంజీవి సినిమాల పై బయ్యర్లలో నమ్మకం తగ్గిందా అన్న సందేహాలు వస్తున్నాయి.


‘లూసీఫర్’ రీమేక్ గా దసరా కు వస్తున్న ‘గాడ్ ఫాదర్’ విషయంలో మరొక సందేహం కూడ వెంటాడుతోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ‘లూసీఫర్’ మూవీని ఓటీటీ లో ఇప్పటికే అనేకమంది ఒకటికి రెండు సార్లు చూశారు. అలాంటి కథను మళ్ళీ తెలుగు సినిమాగా తీస్తే ఎంతమంది ఎంతవరకు ఆసినిమాను ఆశక్తిగా చూస్తారు అన్న సందేహం కూడ ‘గాడ్ ఫాదర్’ ను వెంటాడుతోంది అని కొందరి అభిప్రాయం దీనితో ఈ మూవీ ఫలితం పై మెగా అభిమానులు తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: