ప్రస్తుతం ఇండస్ట్రీలో రామ్ చరణ్ అల్లు అర్జున్ లు యంగ్ డైరెక్టర్స్ విషయంలో అనుసరిస్తున్న కొత్త స్ట్రాటజీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. గతంలో ఎవరైనా యంగ్ డైరెక్టర్స్ ఒక సూపర్ హిట్ మూవీ తీస్తే వారిని చరణ్ బన్నీ లు వెంటనే తమ వద్దకు పిలిపించుకుని వారి వద్ద ఏమైనా మంచి పవర్ ఫుల్ స్టోరీ ఉందా అని అడుగుతూ ఉండేవారట.


గత కొంతకాలంగా చరణ్ బన్నీలు ఎవరైనా యంగ్ డైరెక్టర్ లు తీసిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు ఆసినిమాల ఫంక్షన్స్ కు వచ్చి ఆ దర్శకుల పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ వారికి అవకాశాలు ఇచ్చే విషయంలో ఎటువంటి స్పందన వీరిద్దరి నుండి ఉండటం లేదు అన్నవార్తలు వస్తున్నాయి. అంతేకాదు యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా చరణ్ బన్నీ లను కలిసి ఒక కథ చెపుదామని ప్రయత్నిస్తే కనీసం వారి అపాయింట్ మెంట్ కూడ యంగ్ డైరెక్టర్స్ కు దొరకడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


దీనితో చరణ్ బన్నీలు యంగ్ డైరెక్టర్స్ ను నమ్మే విషయంలో తమ అభిప్రాయాలు పూర్తిగా మార్చుకున్నారా అన్నసందేహాలు కొందరికి కలుగుతున్నాయి. వాస్తవానికి గతంలో అల్లు అర్జున్ అదేవిధంగా రామ్ చరణ్ లు యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చే విషయంలో ముందు వరసలో ఉండేవారు.


అయితే ఇప్పుడు మారిన పరిస్థితులలో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో హీరోలకు నిర్మాతలకు కూడ అర్థంకాని పరిస్థితులలో రిస్క్ చేయడం మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో యంగ్ డైరెక్టర్స్ విషయంలో ఇలాంటి సేఫ్ గేమ్ ను చరణ్ బన్నీలు  ఎంచుకున్నారా అన్నసందేహాలు కూడ కొందరికి వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి దృష్టి తాము నటిస్తున్న ‘పుష్ప 2’ శంకర్ సినిమాల పై ఉండటంతో ఇలాంటి స్ట్రాటజీలో వీరిద్దరూ ఉన్నారు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: